పిల్లల లైంగిక వేధింపులను (“CSA”) పరిష్కరించడానికి క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో జరిగిన పరిణామాలు ప్రధానంగా దీర్ఘ ఆలోచన లేకుండా చేసిన ప్రతిచర్యలు. భాగస్వాములు మరియు నిపుణులతో కనీస సంప్రదింపులు మరియు చర్చలు కూడా నడపకుండా చేసిన ప్రతిచర్యలు ఇవి. ఇదే రీతిలో 2012 లో సమ్మతి ఇవ్వడానికి కనీస వయస్సులో పెరుగుదల తేవడం మరియు 2018లో బాల రేపిస్టులకు మరణశిక్షను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ రెండు చర్యలు ప్రజల ఆగ్రహాన్ని రేకెత్తించిన సంఘటనలకు ప్రతిస్పందనగా చేయబడ్డాయి కానీ తరువాత CSA యొక్క ప్రధాన అంశాన్ని పరిష్కరించడంలో విఫలమయ్యాయని విమర్శించారు. CSA యొక్క సామాజిక-రాజకీయ వాస్తవికతను అర్థం చేసుకోవడంలో న్యాయ వ్యవస్థ విఫలమైంది స్పష్టంగా అర్థమవుతుంది. ఈ పరిస్థితిలో CSAని అరికట్టడంలో చట్టం యొక్క పాత్ర ఏమిటి అని ఆలోచించాల్సిన అవసరం ఉంది.
ఈ ఆర్టికల్ లో, CSAని అరికట్టడంలో భారతదేశం యొక్క చట్టపరమైన ప్రతిస్పందన విఫలమైందని నేను వాదించాను. మొదట, శిక్షపై అధికంగా ఆధారపడటం వల్ల CSA జరగడానికి దారి తీసిన కారణాలని పరిష్కరించడంలో విఫలమేకాకుండా పిల్లలకు హాని కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉందని నేను చూపించాను. రెండవది, బాధితులపై క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ యొక్క ప్రభావాల గురించి చెప్తాను. తరువాత, నేను చట్టం ఆదేశించే ‘తప్పనిసరి రిపోర్టింగ్’ గురించి మరియు దాని వల్ల బాధితులైన పిల్లల మీద కలిగే ప్రభావాల గురించి తెలియచేస్తాను. చట్టం క్రిమినలైజేషన్కు మించి కదిలి బాధితులైన పిల్లలు భౌతికంగా మరియు మానసికంగా నయం అయ్యేలా చర్యలు తీసుకోవాలని నేను సూచిస్తాను.
భారతదేశంలో CSAని అరికట్టడానికి జువెనైల్ జస్టిస్ (పిల్లల సంరక్షణ మరియు రక్షణ) చట్టం, 2015 (“జెజె చట్టం”) మరియు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ చట్టం, 2012 (“పోక్సో చట్టం”) ఉన్నాయి. జెజె చట్టాన్ని ఒక సామాజిక చట్టం, పునరావాసం మరియు ప్రయోజనకరమైన చట్టంగా అర్థం చేసుకోవాలి. మరోవైపు, పోక్సో చట్టం పిల్లల లైంగిక వేధింపులకు శిక్షలను నిర్దేశిస్తుంది. దీనిని ఖచ్చితంగా క్రిమినల్ చట్టంగా అర్థం చేసుకోవాలి. ఈ రెండు చట్టాలు పిల్లల ‘బెస్ట్ ఇంట్రెస్ట్’ సూత్రంపై ఆధారపడి ఉన్నవే.
CSA ఎందుకు జరుగుతుంది?
నిర్మాణాత్మక ఒత్తిడి (ఆర్థిక స్థితి, ఉపాధి, విద్య మొదలైనవి) మరియు హింసకు సంబంధించిన సాంస్కృతిక నిబంధనలు CSAకి కారణమవుతాయి. సరళంగా చెప్పాలంటే, వ్యవస్థ వల్ల కలిగే ఒత్తిడికి CSAకు దారి తీయవచ్చు. పిల్లల పట్ల హింస సాంస్కృతికంగా కూడా అంగీకరించబడి, తప్పనిసరి చేయబడిఉన్నదే. అంతే కాకుండా పిల్లల పెంపకంలో హింస వాడటం తప్పనిసరి అని ప్రకటించబడింది (స్పేర్ ది రాడ్, శ్పొఇల్ ది చైల్డ్). ఇలా పిల్లల సంరక్షణ పద్ధతిలో హింసను సమాజం నిశ్శబ్దంగా ఆమోదించడం వల్ల CSA జరగడానికి ఇది ఒక కీలక పాత్ర పోషిస్తుంది.
చట్టం ఏమి చేస్తుంది?
CSAకి కారణమయ్యే ఈ అంతర్లీన కారణాలను వెలికితీసి, పరిష్కరించడానికి బదులుగా, నిందితుల పట్ల ఏకపక్షంగా పెరుగుతున్న శిక్షాత్మక చర్యలపై మాత్రమే ప్రస్తుత చట్టం దృష్టి పెడుతుంది. ఇటువంటి విధానం CSA బాధితులకు హానికరం.
చాలా వరకు నిందితులు పిల్లలకి తెలుసు, లేదా పిల్లలకి దగ్గరి సంబంధం కలిగి ఉంటారు. నిందితులు రక్తసంబంధీకులైన సంఘటనలలో, పిల్లవాడు వారిని తమ శ్రేయోభిలాషిగా భావిస్తాడు మరియు నిందితుడిపై వారు ఉంచిన నమ్మకాన్ని వదిలివేయడానికి భయపడతాడు. పిల్లలకి నిందితుడిపై ఉన్న నమ్మకం విచ్ఛిన్నమవుతుంది. సున్నితంగా వ్యవహరించకపోతే, పిల్లల ముందుకు సాగడం కష్టమవుతుంది. ఒక పిల్లవాడికి, ఇతర కారణాలవలెనె కాక, వారి నిందితుడిపై మరణశిక్ష విధించడంవల్ల వారి క్షోభ పెరుగుతుంది.
క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ vs. పిల్లల యొక్క స్వస్థత చేకూర్చుట?
క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ యొక్క ఈ శిక్షాత్మక విధానం బాధితుడు మరియు వారి గాయం మరియు క్షోభ కంటే నిందితులపై దృష్టి పెడుతుంది. ఇక్కడ క్రిమినల్ జస్టిస్ సిస్టం కదలికలో ఉండటానికి పిల్లవాడు కేవలం ఒక ట్రిగ్గర్ మాత్రమే. బాధితుడైన పిల్లవాడు కేవలం ఒక మూగ ప్రేక్షకుడిగా తగ్గించబడ్డాడు. క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలోకి పిల్లలని బలవంతం చేయడం ద్వారా, వారి వైద్యం కొరకు ఉపయోగించగలిగే శక్తి మరియు సమయం, వారు న్యాయవ్యవస్థలో ఎటువంటి ఆటంకాలు ఎదురుకోకుండా చూడడానికి ఉపయోగించబడుతుంది. పిల్లవాడు మనసులో ఒక బెదరుని అనుభవిస్తున్నప్పటికీ సిస్టమ్ అదనపు ఒత్తిడిని జోడిస్తున్నట్లు అనిపిస్తుంది. విచారణకు వెళ్ళే సందర్భాలలో కూడా, తార్కిక ముగింపులు చేరుకోలేదు. పిల్లలకి “న్యాయం” దొరుకుతుందన్న హామీ కూడా లేదు. అయితే, ప్రాణాలతో బయటపడిన బాధితులు మరింత మానసిక హింసకు గురవుతారు. వారి ‘ఏజెన్సీ’ మరియు ఎంపిక యొక్క భావం పోతుంది. అయితే వారు ఈ వ్యవస్థ నుండి బయటకు వచ్చేటప్పుడు తమ అభిప్రాయాలను వినడానికి ఎవరూ ఇష్టపడరు అనే భావనతో వస్తారు. న్యాయ వ్యవస్థపై అటువంటి అవగాహనతో, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ మనకు మొదటి సంప్రదింపు స్థానంలొ ఉండొచ్చా అని విశ్లేషించడం అవసరం.
తప్పనిసరి రిపోర్టింగ్
POCSO చట్టం 2012 లోని సెక్షన్ 19 CSA యొక్క ప్రతి ఉదంతాన్ని రిపోర్టు చేయడం తప్పనిసరి చేస్తుంది. రిపోర్టు చేయచకపోతే, సంబంధిత వ్యక్తికి శిక్ష పడుతుంది. CSA ఒక ‘పవర్ గేమ్’ అని గుర్తించి, దానిని రిపోర్టు చేసే బాధ్యతను సమాజానికి ఇస్తుంది కాబట్టి, అలాంటి చట్టం ఉద్దేశం మంచిదే అని భావించవచ్చు.
ఏదేమైనా, జాగర్తగా పరిశీలించగా, ఈ నిబంధన వలన ఆ పిల్ల/ పిల్లవాడి యొక్క క్రియలకు అర్ధం లేకుండా పోతుంది. బాధాకరమైన అనుభవం కలిగి ఉన్న పిల్లవాడిని, దానినుండి కోలుకునే ప్రక్రియ నుండి వైదొలగిస్తుంది మరియు ఆ అనుభవాన్ని బహిరంగంగా న్యాయస్థానంలో అనేకసార్లు తిరిగి జీవించేలా చేస్తుంది. ఆ అనుభవం నుండి పిల్లలు ముందుకు సాగడానికి బదులుగా, వారి జీవితంలో అది ఒక కేంద్ర సంఘటనగా నిలిచిపోతింది (వారి మనసులలో ముద్రించబడుతుంది). ఇటువంటి ‘తప్పనిసరి బహిర్గతం యొక్క ప్రభావంపై ఒక రిపోర్టు, తల్లిదండ్రులు తమ బిడ్డలకు క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ద్వారా అయిన అదనపు గాయం చూసి, ఈ పరిస్థితి గురించి ముందే తెలిసుంటే తమ పిల్లల సహాయం కోసం న్యాయ సంస్థలను సంప్రదించేవారు కాదని చెప్పారని సూచిస్తుంది. అంతేకాకుండా, పిల్లల లేదా తల్లిదండ్రుల జ్ఞానం లేకుండా, వారి సమ్మతం లేకుండా రిపోర్టు చేయవచ్చు కాబట్టి – ఇది వారి చికిత్సకుడిని, వారు నమ్మే వారిని, పిల్లల నమ్మకాన్ని కోల్పోవటానికి నిలబడే ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉంచుతుంది.
CSA ను ఎదుర్కోవటానికి చట్టబద్ధం కాని ఊహాగానము:
తప్పనిసరి రిపోర్టింగ్ ఒక్కటే సమస్య పరిష్కరించదు. CSA పనిచేసే ఒక పర్యావరణ వ్యవస్థ ఉంది, ఇది రిపోర్టింగ్ మరియు దాని పతనాలను నిర్వహించడానికి పిల్లలను స్థితిస్థాపకంగా మరియు బలంగా చేయడంలో భారీ పాత్ర పోషిస్తున్నందున దీనిని పరిగణించాలి. ఈ పర్యావరణ వ్యవస్థలో సాంస్కృతిక సంబంధింత పరిస్థితులు, సంఘం మరియు కుటుంబంతో పాటు పిల్లల రక్షణ వ్యవస్థలు ఉన్నాయి. వాటిని బలోపేతం చేయకుండా మరియు సంవేద్యీకరణము చేయకుండా, రిపోర్టింగ్ తరువాత పరిణామాలను పిల్లవాడు వ్యవహరించాలని ఆశించడం సరైనది కాదు.
పిల్లల సంరక్షణ సంస్థలలో లైంగిక వేధింపుల కేసులలో తప్పనిసరి రిపోర్టింగ్ అవసరం అయితే, CSA ki సార్వత్రిక విధానాన్ని (‘ఒక పరిమాణం సరిపోతుంది’) అనుసరించే చట్టం సరైన పరిష్కారం కాదు. లైంగిక వేధింపుల జరిగిన పరిస్థితి, నిందితుడితో బాధితుడి సంబంధం మొదలైన వాటికి సమస్యను కుదిస్తుంది. పిల్లల లైంగిక వేధింపుల యొక్క వివిధ సందర్భాల్లో వివిధ సంభావిత ఖండనలు ఉన్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకొని విశ్లేషణ చేయాలి మరియు ఈ పనిని కేస్ వర్క్ నిర్వహించే విధానంలో ప్రతిబింబించాలి.
అందువల్ల, సంస్థాగత నేపధ్యంలో CSAకి చట్టపరమైన చర్య ఒక సమాధానం. అయితే, అన్ని సందర్భాల్లో ఇది సమాధానం కాకపోవచ్చు. ఉదాహరణకు, అశ్లీల లైంగిక వేధింపులను వ్యవహరించేటప్పుడు కుటుంబ స్వయంప్రతిపత్తి మరియు బలవంతపు జోక్యం మధ్య సమతుల్యత ఉండాలి. కొన్ని సందర్భాల్లో లైంగిక వేధింపులతో జీవించడానికి పిల్లలకు వనరులు ఉండవచ్చు, ఎందుకంటే అది వారి వాస్తవికత, కానీ వేధింపులని నివేదించిన తరువాత, అనంతర పరిణామాలను ఎదుర్కోవటానికి వారికి తరచుగా వనరులు ఉండవు. నిందితుడిని కుటుంబ నేపధ్యంలో జవాబుదారీగా ఉంచబడచ్చు మరియు వేధింపులని నిలిపివేయవచ్చు. ఇలాంటి సందర్భాల్లో కుటుంబ స్థాయిలో జోక్యం ఉపయోగం ఉన్నట్లుగా కనిపిస్తుంది.
CSAని అంతం చేయాలనుకుంటే, ఇప్పటికే ఉన్న చట్టాల అమలును బలోపేతం చేయడంతో పాటు; పిల్లలకు మరియు వారి సంరక్షణతో సంబంధం ఉన్న నిపుణులకు సరైన లైంగిక విద్యను అందించే ఉపకరణాలను ఏర్పాటు చేయాలి. అయితే CSAని తనిఖీ చేయడానికి వ్యవస్థలను అమర్చడం మరియు పిల్లల స్వయంప్రతిపత్తి కోల్పోకుండా చూసుకోవడం కుడా చేయాలి. CSA బాధితులైన పిల్లలకి మానసిక ఆరోగ్య సంరక్షణను అందించడానికి కూడా ఇటువంటి వ్యవస్థలు విస్తరించాలి. చివరికి, శిక్ష మీద కంటే పిల్లల శ్రేయస్సుపై దృష్టి పెట్టాలి. పిల్లల యొక్క సంపూర్ణ చికిత్స కొరకై, వారు ఆ అవాంఛనీయ సంఘటన నుండి బయటపడేలా చూసుకోవటానికి పనిచేయాలి- మరియు POCSO నియమాలలో కౌన్సెలింగ్ సేవలు మరియు పిల్లలకు సహాయక వ్యక్తులు ఉన్నపటికీ, పిల్లలపై మరింత మానసిక వత్తిడి తెచ్చే ఈ అతిగా-శిక్షాత్మక ఫ్రేమ్‌వర్క్ కి పునర్విశ్లేషణ అవసరం.
CSA ఒక సామాజిక సమస్య. ఈ సామాజిక సమస్యకు ఎల్లప్పుడూ మొదటి సమాధానం చట్టం కాదు; ఒకవేళ అదే మొదటి సమాధానం అయితే, అటువంటి చట్టం బాధితుడి శ్రేయస్సుకి అనుకూలంగా ఉండాలి. CSA పిల్లల జీవితంలో ఒక సంఘటనకు తగ్గించబడాలె కానీ, కేంద్ర సంఘటనగా కాదు.