మేకప్ స్వీయ వ్యక్తీకరణకి మరియు విముక్తి భావన పొందుటకు ఒక పరికరంలా పని చేస్తుంది. వస్త్ర పరిశ్రమ వలె, సౌందర్య పరిశ్రమకు కూడా ఎవరికీ తెలియని ఒక చీకటి వైపు ఉంది. జార్ఖండ్ మరియు బీహార్ సరిహద్దుల మధ్య ఉన్న భారతదేశం యొక్క మైకా బెల్ట్ అయిన భూమి, సూర్యుడు ఉదయించేటప్పుడు మెరుస్తుంది. ప్రపంచ మైకా ఉత్పత్తిలో భారతదేశం 60% వాటా కలిగి ఉంది. మరియు సౌందర్య పరిశ్రమ మైకా యొక్క అతిపెద్ద వినియోగదారులలో ఒకటి. లిప్‌స్టిక్, ఐ షాడో, బ్లష్ వంటి సౌందర్య సాధనాలకు షిమ్మర్‌ని(మెరుపుని) జోడించడానికి ఇది ఉపయోగించబడుతుంది. ఐదు సంవత్సరాల వయస్సులోపు పిల్లలు, సుత్తులు మరియు పారలతో మైకాను తీయడానికి చీకటి అంతులేని సొరంగాల్లోకి ప్రవేశిస్తారు. చేతుల్లో ఉన్న ఉన్నదీ ఏంటో కూడా తెలియని పిల్లల ద్వారా లాభాలు సంపాదిస్తారు. ఇది వనరుల శాపానికి సరైన ఉదాహరణ.
బాలల హక్కులను హరించే ప్రాంతం
ది సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ మల్టీనేషనల్ కార్పొరేషన్స్ (SOMO) ప్రకారం, ప్రపంచంలోని మైకాలో నాలుగవ వంతు జార్ఖండ్ మరియు బీహార్ నుండి వస్తుంది. ఈ అక్రమ గనులలో సుమారు 22,000 మంది పిల్లలు పనిచేస్తున్నారు. దేశంలోనే నిరక్షరాస్యత, నిరుద్యోగం అధికంగా ఉన్న మరియు అత్యంత పేద ప్రాంతాలలో మైకా బెల్ట్ ఒకటి. ‘హ్యాండ్‌బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ’ ప్రకారం, బీహార్ జనాభాలో దాదాపు 33.74% మరియు జార్ఖండ్ జనాభాలో 36.96% దారిద్య్రరేఖకు దిగువన నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో బాల కార్మికులకు ఇది దోహదం చేస్తుంది.
జార్ఖండ్ మరియు బీహార్లలో చాలా మైనింగ్ కార్యకలాపాలు చట్టవిరుద్ధంగా నిర్వహించబడుతున్నాయి. 1950 నుండి, ఈ ప్రాంతాల్లో చట్టపరమైన గనుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. అటవీ సంరక్షణ చట్టం, 1980 తరువాత, కేంద్ర ప్రభుత్వం మైనింగ్ లైసెన్సులను పునరుద్ధరించడాన్ని పూర్తిగా నిలిపివేసింది. ఇది అక్రమ మైనింగ్‌ని అమాంతంగా పెంచివేసింది. ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ ప్రకారం, 2014 లో బీహార్‌లో కేవలం రెండు లీగల్ గనులు మాత్రమే ఉన్నాయి, జార్ఖండ్‌లో లీగల్ గనులు లేవు.
అటువంటి ప్రాంతాలలో అక్రమ మైనింగ్ యొక్క తీవ్రతను పై పట్టిక వివరిస్తుంది.
చాలా గనులు చట్టవిరుద్ధం కాబట్టి, భారీ యంత్రాలు తరచుగా ఉపయోగించబడవు. ఇది మానవీయ శ్రమపై ఆధారపడటాన్ని పెంచుతుంది. మైకా భూగర్భ సొరంగాలను ఉపయోగించి తవ్వబడుతుంది, ఇవి చాలా చిన్న పరిమాణంలో ఉంటాయి మరియు ఈ చిన్న సొరంగాల్లో మైనింగ్ కోసం సరిపోయేలా పిల్లలను వారి చిన్న శరీరాల కారణంగా, పరిపూర్ణులని భావిస్తారు. ఈ రెండు కారణాలు వాల్ల మైనింగ్ పరిశ్రమలకు బాల కార్మికులు లాభసాటి.
పిల్లలపై ప్రభావం: ఆరోగ్యం మరియు విద్య
పని యొక్క ప్రమాదకర పరిస్థితుల కారణంగా బాల కార్మికుల *దుర్భర/అధ్వాన్నమైన రూపాలలో మైకా మైనింగ్ ఒకటి. అలాంటి చిన్న గనులలో పనిచేసే అతి పెద్ద ప్రమాదం ఏమిటంటే, ఏ సమయంలోనైనా అవి కూలిపోయి పిల్లలను సజీవంగా భూమిలో పాతిపెట్టబడవచ్చు. ఇటువంటి సంఘటనలు తరచూ రిపోర్ట్ చేయబడవు. ఇలా పిల్లల కుటుంబాలకు రిపోర్ట్ చేయకుండా మరియు మైనింగ్ కొనసాగించడానికి “బ్లడ్ మనీ”(నష్టపరిహారం) ఇవ్వబడుతుంది. పిల్లలు పని చేసే చోటులో సిలికా దుమ్ము ఉంటుంది, అది ఊపిరితిత్తులకు సంబందించిన తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుంది. గాయాలు, చర్మ వ్యాధులు, ఎముకలు విరగడం మరియు వేడి దెబ్బలకు పిల్లలు గురవుతారు. మైకా మైనింగ్ వల్ల కలిగే ఆరోగ్య సమస్యల కారణంగా, కుటుంబాలు వారి కుటుంబ సభ్యుల వైద్య చికిత్స కోసం దుర్మార్గులైన వడ్డీ వ్యాపారుల నుండి రుణాలు తీసుకోవలసి వస్తుంది. ఇది వారిని రుణ ఉచ్చులలోకి మరియు బానిసత్వంలోకి నెట్టివేస్తుంది – రుణాలను తిరిగి చెల్లించడానికి ఈ గనులలో పనిచేయడం తప్ప మరో మార్గం లేకుండా వారిని వదిలివేస్తుంది. ఈ వడ్డీ వ్యాపారులు అక్రమ మైకా గనుల వ్యాపారులు మరియు నిర్వాహకులు. వారిని సాధారణంగా స్థానికులు “మైకా మాఫియాస్” అని పిలుస్తారు.
పిల్లవాడు విద్యా హక్కును కోల్పోతాడు మరియు కొన్ని రూపాయల అతికొద్ది జీతం కోసం గనులలో పని చేస్తాడు. జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్ చేసిన ‘జార్ఖండ్, బీహార్‌లోని మైకా మైనింగ్ ప్రాంతాల్లోని పిల్లల విద్య మరియు శ్రేయస్సుపై సర్వే’ ప్రకారం, జార్ఖండ్ మరియు బీహార్ ప్రాంతాలలో 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల 4,545 మంది పిల్లలు మైకా గనులలో పనిచేస్తున్నందుకు, పాఠశాలకు హాజరు కావడం లేదు. ఒక *దుర్మార్గపు వృత్తంలో(vicious circle), ఈ పిల్లలు పెద్దలుగా మారినప్పుడు, విద్య లేకపోవడం వల్ల వారు ఉద్యోగాలు పొందలేకపోతున్నారు మరియు వారికి ఈ గనులలో పనిచేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోతుంది.
చట్టపరమైన ముసాయిదా(నిర్మాణ పద్ధతి)
భారతదేశంలో, బాల కార్మిక (నిషేధ మరియు నియంత్రణ) చట్టం,1986 మరియు నాటి గనుల చట్టం, 1952 (1983 లో సవరించినట్లు) మైనింగ్‌లో బాల కార్మికులను నిషేధించాయి. చైల్డ్ లేబర్ (ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్) చట్టం 1986, 14 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను భూగర్భ గనులలో పనిచేయడం, మైకాను కోయటం / భాగాలుగా విడగొట్టటం మరియు ఉచిత సిలికాకు నేరుగా గురైయ్యే ప్రక్రియలో పనిచేయడాన్ని నిషేధిస్తుంది. అయితే, 1952 నాటి గనుల చట్టం (1983 లో సవరించినట్లు) ఇలా పేర్కొంది, “పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న వ్యక్తికి భూమి పైన ఉన్న, ఏదైనా మైనింగ్ ఆపరేషన్‌తో అనుసంధానించబడిన లేదా యాదృచ్ఛికమైన ఏదైనా ఆపరేషన్ కొనసాగుతున్న గనిలోనికి అనుమతి లేదు.”
అంతర్జాతీయంగా, బాల కార్మికుల దుర్భర/అధ్వాన్నమైన రూపాలపై మరియు కనీస వయస్సులపై రెండు ప్రధాన సమావేశాలను భారతదేశం ఆమోదించింది: i) C138 – కనిష్ట వయసు సమావేశం, 1973 మరియు ii) బాల కార్మికులకు సంబంధించిన ILO యొక్క , C182 – చైల్డ్ లేబర్ కన్వెన్షన్ యొక్క దుర్భర/అధ్వాన్నమైన రూపాలు, 1999. C138 – కనిష్ట వయస్సు కన్వెన్షన్, 1973 ప్రకారం 18 ఏళ్లలోపు పిల్లవాడు (భారతదేశం విషయంలో కనీస పేర్కొన్న వయస్సు 14) ఎటువంటి ప్రమాదకరమైన పని చేయరాదు , అయితే C182 – దుర్భర/అధ్వాన్నమైన రూపాలు బాల కార్మిక సమావేశం, 1999 ప్రకారం తమ దేశంలో బాల కార్మికుల దుర్భర/అధ్వాన్నమైన రూపంపై వెంటనే చర్యలు తీసుకోవాలి.
మైకా మైనింగ్ పరిశ్రమలలో బాల కార్మికులను ఎదుర్కోవటానికి కార్పొరేట్ బాధ్యత
వివిధ సంస్థలు, ప్రభుత్వం మరియు మీడియా చేసిన కృషి కారణంగా ఇటీవలి సంవత్సరాలలో సరఫరా గొలుసులలో(సప్లై చైన్) బాల కార్మికుల పట్ల అవగాహన బాగా పెరిగింది. ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి మరియు నివారించడానికి వ్యాపారాలపై ఒత్తిడి పెరిగింది. ఏమిటంటే వ్యాపారం మరియు మానవ హక్కులపై UN మార్గదర్శక సూత్రాలు (UNGP లు, 2011) ఇది, మానవ హక్కులను (పిల్లల హక్కులతో సహా) గౌరవించాల్సిన వ్యాపారాల బాధ్యతలను పరిగణనలోకి తీసుకుని ప్రాముఖ్యతను పొందుకుంటుంది. సరఫరా గొలుసులో(సప్లై చైన్) బాల కార్మికులు వంటి సమస్యలను పరిష్కరించడానికి విధానాలను కలిగి ఉండాలని కార్పొరేషన్లను ఆదేశిస్తుంది.
అనేక పెద్ద సంస్థలు ఈ పరిశ్రమలో బాల కార్మికుల ఉనికిని గుర్తించాయి మరియు దీనిని పరిష్కరించడానికి చర్యలు తీసుకున్నాయి. ఎస్టీ లాడర్, లోరియల్, క్లారిన్స్, కోటి, చానెల్ మరియు బర్ట్స్ బీస్ వంటి సంస్థలు ‘పారిస్ ఆధారిత బాధ్యతాయుతమైన మైకా ఇనిషియేటివ్’ (RMI) లో చేరాయి. ఈ సంస్థలతో కలిసి RMI సరఫరా గొలుసులో మైకాను సరఫరా చేసే ప్రాసెసర్లు మరియు గనుల జాడ కనుగొని తిరిగి గుర్తించడం ద్వారా బాల కార్మికులను మెరుగుపర్చడానికి పనిచేస్తుంది. వీటితో పాటు, RMI సభ్యలైన సంస్థలు తమ సొంత సరఫరా గొలుసులలో, పర్యావరణ, ఆరోగ్యం, భద్రత, చట్టపరమైన మరియు న్యాయమైన కార్మిక పద్ధతులను కలిగి ఉన్న ప్రమాణాలను అనుసరిస్తాయి, వీటిలో బాల కార్మికులను ఉపయోగించడాన్ని నిషేధించారు. UKకు చెందిన లష్ కాస్మెటిక్స్‌కు బాల కార్మికుల పరిస్థితిని గూర్చి హెచ్చరించినప్పుడు, అవి కృత్రిమ మైకాను వాడడం మొదలు పెట్టాయి. దీనితో అనేక కుటుంబాలు నిరుద్యోగులుగా మార్చబడ్డాయి. ఇలా వారి పరిస్థితిని మరింత దిగజార్చడంతో ఈ ‘కట్ అండ్ రన్’ వ్యూహాన్ని చాలా మంది నిపుణులు విమర్శించారు. ఇది పెద్ద సంస్థలు సమస్యలో భాగమని గుర్తించదు. మరియు సమస్య నుండి తమను తాము విడదీసుకోవడం కంటే కార్పొరేషన్లు దాన్ని పరిష్కరించడానికి చేతన ప్రయత్నాలు చేయాలి. సేకరించబడే ముడి సరుకును ఎక్కడనుండి వాచిందో కనిపెట్టగలిగే శక్తిని మరియు జవాబుదారీతనాన్ని మెరుగుపరచడం ద్వారా ఇది చేయవచ్చు.
ప్రభుత్వాలు మరియు స్వచ్ఛంద సంస్థల ప్రయత్నాలు: ముందుకు వెళ్లే త్రోవ ఏమిటి?
నైతిక మరియు క్రూరత్వం లేని ఉత్పత్తుల కోసం వినియోగదారుల డిమాండ్లతో పాటు, కంపెనీలు మార్పు కోసం కృషి చేయడానికి ప్రభుత్వాలు ప్రోత్సాహకాలను కూడా అందిస్తున్నాయి. కంపెనీల నుండి పారదర్శకత పెరగాలని ప్రభుత్వాలు ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాయి. ఉదాహరణకు, నెదర్లాండ్స్‌లో ‘చైల్డ్ లేబర్ డ్యూ డిలిజెన్స్ యాక్ట్’ డచ్ సెనేట్ ఆమోదించింది. నెదర్లాండ్స్ వెలుపల రిజిస్టర్ చేయబడిన కంపెనీలతో సహా, డచ్ వినియోగదారులకు వస్తువులు అమ్మడం లేదా సేవలను అందిస్తున్న కంపెనీలు( కంపెనీలు లేదా వ్యక్తులు కావచ్చు) సరఫరా చేయవలసిన సేవలు లేదా వస్తువులు బాల కార్మికులను ఉపయోగించి ఉనికిలోకి తెచ్చినట్లయితే “సహేతుకమైన అనుమానం” ఉందో లేదో అంచనా వేయడానికి తగిన శ్రద్ధ వహించాలి. ఉల్లంఘన భారీ జరిమానాకు దారితీస్తుంది. ఈ చట్టం క్రిమినల్ బాధ్యత కోసం కూడా వహిస్తుంది.
భారతదేశంలో, పరిస్థితి యొక్క తీవ్రతను విశ్లేషించిన తరువాత, బాల కార్మికులను సమర్థవంతంగా నిషేధించడంలో సహాయపడటానికి పెన్సిల్ పథకాన్ని (PENCIL scheme – ప్లాట్ఫారం ఫర్ ఎఫెక్టివ్ ఎన్ఫోర్స్మెంట్ అఫ్ నో చైల్డ్ లేబరు) బీహారులో 23 జిల్లాలలో, ఝార్ఖండ్‌లోని 7 జిల్లాలలో , అమలు చేసింది. బాల కార్మికులకు సంబంధించి ఆన్లైన్ ఫిర్యాదులను నమోదు చేయడానికి ఇది ఒక ఆన్లైన్ వేదికను అందిస్తుంది మరియు నివేదించబడిన కేసులను పర్యవేక్షించడానికి జిల్లా స్థాయిలో అధికారులను నియమిస్తారు. రక్షించబడిన పిల్లలను విద్య లేదా వృత్తి శిక్షణ పొందిన కేంద్రాలకు పంపుతారు. ప్రాంతీయ స్థాయిలో, 1980 లో నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి ఏర్పాటు చేసిన ‘బచ్పాన్ బచావ్ ఆండోలన్ (బిబిఎ)’ అనే స్వచ్ఛంద సంస్థ బాల కార్మికులను విడిపిస్తు మరియు అక్రమ రవాణా నుండి పిల్లలను కాపాడుతు ఈ సమస్యను పరిష్కరిస్తోంది. ఇది బాల మిత్రా గ్రామ్ (బిఎమ్‌జి) లేదా చైల్డ్ ఫ్రెండ్లీ విలేజ్ (సిఎఫ్వి) ను స్వీకరించింది, ఇక్కడ పిల్లల హక్కులు మరియు వారి గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం పిల్లలు వారే వాదించే ఒక అభివృద్ధి మోడల్. ఈ మోడల్ ఇప్పటివరకు పనిచేస్తున్నట్లు కనిపిస్తోంది, ఎందుకంటే మైకా బెల్ట్‌లోని 60 గ్రామాలను సిఎఫ్విగా మార్చారు మరియు 2,370 మంది పిల్లలను పాఠశాలలో చేర్చారు. విద్య ఈ సమస్యను మూలాల నుండి నయం చేస్తుంది. అందువల్ల ప్రభుత్వం ఈ ప్రాంతాల్లో విద్యా సౌకర్యాల నాణ్యతను పెంచాలి. పిల్లలకు పాఠశాలకు హాజరు కావడానికి ఎక్కువ ప్రోత్సాహకాలు ఉండాలి. జార్ఖండ్ / బీహార్‌లోని బాల కార్మికులను ఎదుర్కోవటానికి మైకా మైనింగ్ ప్రాంతంలో ఉన్న కుటుంబాలకు స్థిరమైన ప్రత్యామ్నాయ ఆదాయ-ఉత్పాదక అవకాశాలను కూడా అభివృద్ధి చేయాలి,. కార్పొరేషన్లు, ప్రాంతీయ సంస్థలు మరియు ప్రభుత్వాల ఇటువంటి చురుకైన మరియు చేతన చర్యలు మాత్రమే మైకా మైనింగ్‌లో చిక్కుకున్న పిల్లలు మరియు జార్ఖండ్ మరియు బీహార్ కుటుంబాలకు ఆత్మగౌరవం మరియు గౌరవమైన జీవితాన్ని నిర్ధారించగలవు.